Friday, 13 November 2015

ఒక చిన్న మాట 21 :

(తిరుపతి ప్రసాదం)

ఎన్ని దేవుళ్ల ప్రసాదాలు ఉన్నా గాని ''తిరుమల-తిరుపతి -వేంకటేశుని '' దివ్య ప్రసాదం యొక్క రుచి ,వాసన ఆ యొక్క అనుభూతి నే వేరు . ఎంత తిన్నా కాని ఇంకా తినాలని అట్టే మనల్ని కట్టి పడేస్తుంది . అలాగే ఆ దివ్య ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నప్పుడు కూడా ,తీసుకునే వారిలో కాని ,ఇచ్చేవారిలో కాని ఒక భక్తి భావం హృదయంలో నిలుస్తుంది . అటుమంటిదే నేనూ ఆ ప్రసాదాన్ని పంచుతున్నప్పుడు కొంతమంది తమ భక్తి భావంతో చెప్పులు విడిచి ,నుంచొని , కళ్లకు హద్దుకుని మరీ తీసుకుంటే వారు ఆ ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూస్తున్నారో వారి కళ్లలో కనపడింది . అలా వారు తీసుకుంటుంటే ఇంకా ఇంకా ఆ ప్రసాదాన్ని పంచాలనే భావన కల్గుతుంది . ఈ ప్రసాదం పొందిన వారిని ఆ తిరుమలేశుడు వారికి శుబాన్ని కలుగ చేయాలనీ కోరుతున్నాను ....

Friday, 23 October 2015

ఒక చిన్న మాట  20 :-


చాలా రోజుల తర్వాత మరల ఈ ''ఒక చిన్న మాట '' తో చెప్తున్నాను 
ఒకరు వారి కళ్ల ముందు కాస్త ఎదుగు తుంటేనో ,పేరు కొంచెం వస్తుంటేనో తట్టుకోలేరు 
అందరిముందూ నవ్వుతూ మాట్లాడుతూ ,మనం లేనప్పుడు మన గురించి మరొకరి దగ్గర చెడుగా మాట్లాడే వాళ్లే తయారవుతున్న రోజులివి . ఒకరి దగ్గర వారు గొప్పగా పేరు తెచ్చుకోవాలి ,ఆ వ్యక్తి మనకే సొంతమవ్వాలి ,మన మాటే వినాలి మనకి నచ్చని వాళ్ళు అయ్యినా సరే ,నచ్చిన వాళ్ళు అయినా సరే మనం అనుకున్న వ్యక్తితో నేరుగా వారు గొప్ప అనిపించుకోకూడదు . అందుకోసం వారు వారు అనుకున్న వ్యక్తి దగ్గర వీరి ప్రస్తావన తేనే తేరు ... ఏంటో ఈ దుర్బుద్ధి మనం మంచిగా సంతోషంగా ఉండాలి అలానే మనతోటి వారు మనకన్నా మంచిగా సంతోషంగా ఉండాలి అనే ఆలోచన ఉండనే ఉండదా ఏమీ ? చిన్నప్పుడు మనం ప్రతిజ్ఞ చేసే వాళ్ళం కదా మరి అది ప్రతిరోజూ చదివిన మనకు పక్క వారి మనసులను ఎందుకు చదవలేకపోతున్నాం ? ఇది ఏదో నా గురించి , నాకు జరిగిన లేదా చూసిన సంఘటన నుంచి చెప్పటం లేదు .... ఉదాహరణగా చూస్తే ఇలాంటివి కోకొల్లలు కొంతమంది చెప్పుకుంటారు ,మరికొంతమంది చెప్పుకోలేరు 
ఒకర్ని పొగడాలంటే నాలుక రాదు ,తిట్టాలంటే మాత్రం సమయం చాలదు . తమ గొప్పలు తమకే మోజు  అందరిలో వారే ఏదో పై చెయ్యి లా ,అందరి చేత వారెప్పుడు కీర్తించబడేలా ఉండాలి అనుకుంటారు దానికోసం ఎటువంటి విలువలు పట్టించుకోరు 
మనం మనలానే ఉండాలి అనే తీరు ఉండదు అందరికీ వాళ్ళు చేసారు మనం చెయ్యాలి ,వాళ్ళు గెలిచారు మనమూ గెలవాలి అంతే తప్ప వాళ్లతో మనకెందుకు మనకంటూ అవకాశం వచ్చినప్పుడు చూసుకుందాం లేదా ఒక స్పూర్తితో ముందుకు పోదాం అనేదే ఉండదు . ఏంటో ఈ మనషుల మనసులు చూస్తుంటే మనకి మనమే అర్ధం కాము కొన్నాళ్ళకి 






Friday, 7 August 2015

ఒక చిన్న మాట (19) :

అన్నీ కల్తీలు జరుగుతున్నరోజులివి .మనకు ఇంట్లో అవసరమైన కాయగూరల నుంచి సరుకుల వరకు ప్రతీది కల్తీ జరుగుతూనే ఉంది . మనకు తెలియక కొన్నింటికి మనం కొంటూనే ఉంటాము కారణం బిజీ లైఫ్ లో అంట టైం మనకు లేకపోవటం ,ప్రతీ పని చాలా తేలికగా ,కష్ట పడకుండా జరిగిపోవాలని కోరుకోవటం ,మరి కొన్ని మనకు తెలియకుండానే అలా అలవాటుపడిపోతుంటాం . కూరగాలయితే చూసి చూసి మరీ అది ముదురా , కాదా అని తెల్చుకోగలం , సరుకులలో కొన్ని కొన్ని తెలుసుకోగలం ...ఈ మద్య ఫ్రూట్స్ అయితే చూస్తానికి బాగా నిగ నిగ లాడుతూ ఉంటాయి మేడి పండు చూసినట్టు ,సరిగ్గా పరిశీలిస్తే కొన్ని ఫ్రూట్స్ కి 

Wednesday, 5 August 2015

ఒక చిన్న మాట 18  (07 ఆగస్టు 15)
*** తొందరపాటు తనం *****

మనలో చాలా మందికి ఇది ఉంటుంది . ఒక మాటలో చెప్పాలంటే కంగారు , మరో విధంగా అయితే స్పీడ్ , ఇంకొక విదంగా అయితే అమాయకత్వం అన్నీ కలిస్తేనే ఈ తొందరపాటు తనం . మనకు ఒక విషయం గురించి పూర్తిగా తెలిస్తే కాని మరొకరి విషయంలో జోక్యం చేసుకోకూడదు . కొంతమంది వారికి ఏమీ తెలియక పోయినా , కొంచెం తెలిసినా మరొకరి విషయంలో కాని ., వారు చేసే పనిలో కాని చొరవ చేసుకుని వారి అతి ఏమిటో చూపిస్తూ ఉంటారు . కొంతమంది అయితే వారికేమీ తెలియకపోయినా ,అది ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఎదురుగా ఉన్నవారితో కాని , చేయబోవు పనిలో కాని చొరవ చూపించి ,ఆ తర్వాత అది బెడిసి కొట్టి ,నాలుక కరచుకుంటారు . అన్నీ తెలిసినా అనుకోకుండా టైం బాగోకో , చిన్నా ,పెద్దా పొరపాటులో ఇరుక్కునే వాళ్ళు లేకపోలేదు . ఇలాంటి సంగటనలు ప్రతి ఒకరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చెరగని మచ్చలా ,ఉండిపోతాయి కూడా . ఈ అన్ని తల మాసిన పనులకి కారణం తొందరపాటుతనం . ఆ తొందరపాటుతో జరిగిన తప్పిదాన్ని సరి చేసుకోగలిగేవి కొన్ని , జరిగిన తప్పుకు పచ్చాత్తాపం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలిపేవి కొన్ని . అందుకే మిత్రాస్ ,తొందర పడి పది మందిలో చెడ్డ పేరు తెచ్చుకోవద్దు , మన తొందర పాటు తనంతో మరొకరి మనస్సును గాయపరచవద్దు . ఏదైనా ఒక పని ప్రారంబించేముందో , ఒకరి విషయంలో చొరవ తీసుకునే ముందు కాస్త మీకు మీరు ఆలోచించుకోండి . మనకు బాగా నైపుణ్యం ఉన్నప్పుడే మరొకరి పనులకు సహాయం చేయాలనీ చూడండి లేదా కాస్త ఓపికతో నిలవండి . 
ఒక చిన్న మాట 17 : (05 ఆగస్టు 15)

కాలం మారుతున్న కొద్ది పెద్దవాళ్ళంటే చిన్న వాళ్ళకి అమర్యాద ,హేళన ,చులకన భావం పెరుగుతూ వస్తున్నాయి . ఒక్క సారి ఆలోచించండి వారు మనం ఈ స్థితికి రావటం కోసం ,ఎంత శ్రమ ఉంటారో ,ఎన్ని ఇబ్బందులను ఓర్చుకుని ఉంటారో !  వాళ్ళకి ఆ ఇబ్బందులు ,ఒడి దుడుకులు పెద్ద కష్టమేమీ కాదు , అవి వారిని భాదించలేదు కూడా కారణం వారు పడే ప్రతి చిన్న కష్టం , శ్రమ మన సుఖం సంతోషాల కోసమే . వాళ్ళ ఆనందాన్ని మనలో చూసుకుని మురిసిపోతుంటారు అది మన తల్లి దండ్రులు అయినా . తాతా నాయనమ్మలు , పిన్ని బాబాయిలు , పెద్దమ్మ ,పెద్దనాన్న లైనా , అత్తమ్మ్ -మావయ్యలు అయినా ప్రతీ వారితోటి మనకున్నది బంధం ,అను భందాలే తప్ప అవసరాలు కాదు . అవసరం ఉన్నంత వరకు ఒక లాగా , అవసరం లేకపోతె మరోలాగా మన చుట్టాలతోటో , మన సన్నిహితుల తోటో , మన మంచి కోరుకునే వాళ్ళ తోటో  అది ఎవరితోటి అయిన మనం దేశం ,మన కుటుంభం నుంచి నేర్చుకున్న సంస్కారాన్ని దురహంకారం తోటి దూరం చేసుకోకూడదు . పెద్ద వాళ్ళు అంటే మన వాళ్ళు అయినా ,పరాయి వాళ్ళు అయినా మన దగ్గర ఉన్నంత సేపు మనం గౌరవంగా , మర్యాదగా నడుచుకోవాలి . పెద్దవాళ్ళు పెద్దరికం గానే మాట్లాడుతారు , మనకు హితం చెప్పటానికే చూస్తారు అంతమాత్రం చేత వాళ్లతో మనం చెప్పిచ్చుకునేది ఏంటి అనో , మనకూ అన్నీ తెలుసనో పట్టింపు లేనట్టు ప్రవర్తించ కూడదు . మనకు ఎంత తెలిసినా ,ఎంత ఎదిగినా మనం వాళ్ళకన్నా తక్కువే , మనం వాళ్ళ ముందు చిన్నవాళ్ళమే . అందుకే అంటారు పెద్దలు చెప్పే మాట సద్దన్నం మూట అని కాబట్టి పెద్దలను గౌరవించండి . వారిని ఆరాదించడి 

Sunday, 2 August 2015

ఒక చిన్న మాట 16 :


ఈ రోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవమున మన  ముఖ పుస్తక మిత్రులు , ఆత్మీయులు ,గురువులు అయిన
''శ్రీ నూతక్కి  రాఘవేంద్రరావు  '' గారి ఇంటికి వెళ్ళటం జరిగింది .. వారిని కలవటం ,వారితో కాసేపు సమయం గడపటం ,సాహితీ ముచ్చట్లతో కొన్ని నేర్చుకుంటూ ,కొత్తవి తెలుసుకుంటూ ,మాకు ఒక మధురమైన రోజు గా ఈరోజు నిలచింది . వారి ఆత్మీయ స్నేహానికి స్వాగతిస్తూ ,పులకరిస్తూ మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము .


Wednesday, 29 July 2015

ఒక చిన్న మాట :15

మన ప్రధానమంత్రి ''మోడీ '' గారు స్వచ్చంధంగా గ్యాస్ సబ్సిడీని వదులుకోమని చెప్తున్నారు బాగానే ఉంది
ఇది పెద్ద పెద్ద తిమింగలాలను వదిలేసి చిన్న చిన్న ఎరలకై పోరు సాగిస్తున్నట్టుంది . వెనుకనుంచి పెద్ద పెద్ద ఏనుగుల సమూహంలా సొమ్ము తరలిపోవచ్చు కాని మన ముందు చీమలదండు తో పోయే చక్కరకు లెక్కలు కడుతున్నారు . మీది మంచి ఆలోచనే దీని ద్వారా కొంతలో కొంతైనా వృధా కాకుండా ఉంటుంది కాకపొతే మా లెక్క కూడా కాస్త చూడండి సారు . మధ్య తరగతి లో ఉన్న వాళ్ళము , పేదవాళ్ళకేమో సంపాదించేది కొంత ,కాని మా దగ్గర నుంచి ఆ ధరలు ,ఈ పన్నులు అంటూ బ్రతుకు భారము కొండంత . అదే మన ప్రభుత్వపు జీతాన్ని లక్షలలో తీసుకునే వాళ్లకేమో దాదాపుగా అన్నీ తక్కువ ధరలే , మరి కొన్ని చోట్ల అయితే అంతా ఉచితమే . మీరు మంత్రి అయ్యింది కూడా సామాన్యుడి నుంచే కదా ! ఇదిలా ఒక సంపాదన మన మంత్రులకు ఉంటే అది చాలీ చాలదన్నట్టు ప్రజా సేవ పేరుతో వారి తీసుకునే అమ్యామ్యాలు ఎన్నో ... వారు చెయ్యవలసిన పనిని భాద్యతగా చెయ్యకపోగా ప్రతీ ప్రజా అవసరానికి ఒక రేటు పెట్టుకుంటూ ,ఆ సంపాదన ఎందులకు .... అలా సంపాదించి సంపాదించి డబ్బు ఎక్కడ ఎలా దాచుకోవాలో తెలియక ''బినామీలు '' ''స్విస్ ఖాతాలు '' ఎందుకు ....సామన్యుడు నిజాయితీగా నిలబడటానికి ముందు ఉంటాడు మరి ఒక గౌరవ పదవిలో ఉంటూ అందరికీ మార్గ దర్సకంగా ఉండే మన పెద్ద మేధావులే అలా నీతిని మరచి కూడబెట్టుకునే సంపాదన ఎందులకు ... బ్రతికేంత వరకు సంతృప్తిగా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళితే చాలదా ? మరి సారూ ? అందరినీ ఒకేలాగా తప్పు పట్టలేం కాని అలా కూడగట్టుకున్న బినామీలను ,స్విస్ ఖాతాలను స్వచ్చందంగా వదులుకోమని చెబుతారా ? వాటిని దేశమో లేక రాష్ట్రమో లేక వారి గ్రామ భవిష్యత్తు కోసమో వినియోగించమని చెబుతారా ?

Monday, 27 July 2015

ఒక చిన్న మాట 14 :

చాలా మంది చిన్న చిన్న వ్యాపారులు ,తమ తమ దుకాణాలు మూసివేసే సమయంలో ,నిమ్మకాయలు ,గుమ్మడికాయలు & కొబ్బరికాయలు ,మిరపకాయలు ఇంకా రక రకాలుగా దిష్టి తీసి , రోడ్డు మీద అడ్డంగా పడేస్తుంటారు .ఇది ఎంత వరకు సమంజసం . అలా దిష్టి వేసి పడవేసిన వాటిని తొక్కితే అది తొక్కిన వారికి చుట్టుకుంటుందని అంటారు . ఇది మన మూడ నమ్మకాలో , మన దినచార్యతో పాటు వస్తున్న ఆచారాలో తెలియదు కాని , షాపులో దుమ్ము ,దూళినైతే ఊడ్చి చెత్తబుట్టలో వేస్తారు . మరి వీటిని మాత్రం రోడ్డు మీద పడేసి పబ్లిక్ ఎందుకు ఆటంకం కలిగిస్తారు . అవి చెత్త లాగా రోడ్డు కి అంటి పెట్టుకుని ఉంటం మాత్రమే కాకుండా వాటిని చూసిన జనాలకు ఒక చిరాకు ,మానసిక అశాంతిని కలుగ చేస్తుంటాయి .

దయచేసి ఆలోచించండి మిత్రులారా , ఇలా దిష్టి పేరుతో మన పరిసరాలను మనమే అశుభ్రపరుచుకుంటే ఎలా ?అందరూ మన లాంటి వారే , మన తోటి వారే మంచి జరగాలని మీకు మాత్రమే కాదు ,అందరి మంచి కోరుకున్నవారే మహాత్ములు అవుతారు . 
ఒక చిన్న మాట 13 :

డా// ఎ .పి. జె అబ్దుల్ కలాం (1931-2015)

ఇది ఒక చిన్న మాట కాదు గుండె బరువెక్కే మాట
గొంతు మూగబోయిన మాట , మాట మౌనంలా నిలచిపోయే మాట
దేశానికే గర్వ కారణమైన మహా మనిషి
ఒక అద్బుత అంతరిక్ష రక్షణ శాస్త్రవేత్త
మన మాజీ రాష్ట్రపతి డా //ఎ .పి. జె . అబ్దుల్ కలాం కన్ను మూసిన క్షణం
యావత్ భారతావని అంధకారంలోకి వెళ్ళిన క్షణం
మనకు ఎన్నో నేర్పారు , ఆయన సూక్తులతో మనల్ని ముందుకు నడిపించారు
నవ్వుతూ పలకరిస్తూ ,తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచే విజ్ఞాన వేత్త
ఏమిచ్చి నివాళులు అర్పించగలము మీకు
మీరు చేసిన దేశ సేవలకు ,మీరు అందించిన  దేశ కీర్తి ప్రతిష్టలకు
ఊహించని చేదు వార్త ... మా హృదయాలలో చొచ్చుకుని వచ్చిన తూటా
నమ్మలేని నిజము మీరు దూరమయ్యారని
కాంక్షించగలము మరలా మరో అబ్దుల్ కలాం లా మాకోసం తిరిగొస్తారని
.........................RIP




Saturday, 25 July 2015

ఒక చిన్న మాట 12 :

నందమూరి తారక రామారావు
ఆ పేరు లోనే అధ్బుతమైన మాయాజాలం ఉందేమో
ఆయనతోటే ఒక గొప్ప దివ్య తేజం ఆవిర్భవించిదేమో
ఆ ముఖ వర్చసులోనే ఏదో తెలియని ఆకర్షణ
ఎంత చూసినా తనివి తీరా చూడాలనిపించే చంద్రబింభం
ఆయన మాటలు వింటుంటే అమాంతం కట్టిపడేసే ఉపదేశం
ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి , ఒకవేళ చెప్పుకున్నా అతిశయమే అవుతుంది
ఆయన నటన ఆయన నైపుణ్యమో , వరమో తెలియదు కాని
ఆయన నటనలో జీవాత్మకత ఉట్టిపడుతుంది
ఆయన ఒక పాత్ర పోషిస్తుంటే ఆ పాత్రకే సరికొత్త రూపాన్ని ఇస్తుంది
అందుకే మనం దేవుళ్ళని చూడకపోయినా రాముడైనా ,క్రిష్ణుడైనా
అచ్చం ఆయన్ని చూస్తే అలానే ఉంటారు అనుకుని ఆరాదించే వాళ్ళు కూడా ఉన్నారు
ఇప్పటి కొత్త తరానికి కూడా ఆయనే ఆదర్శం ,ఒక మార్గ దర్శకత్వం
క్రమశిక్షణ ,నిజాయితీ ,నిబద్దత ,అంకితభావం , నిరాడంబరత
ఇలా ఒక్కటేమిటి ప్రతి తెలుగు పదంలోనూ ఆయనే కనిపిస్తారు

Friday, 24 July 2015

ఒక చిన్న మాట .... 8

జీవితం చాలా చిన్నది ,విలువైనది . ఇంత చిన్న జీవితంలో ఒకరిపై ఒకరం రాగ ద్వేషాలను పెంచుకుంటూ , ఎవరో మనల్ని ఒక మాట అన్నారని , ఎవరో ఏదో చేసారని వారి చర్యలకు ఫలితంగా మనం ఏదో ఒకటి చెయ్యాలని యుగోయిజంగా ఆలోచించటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి . అందరూ ఒకేలా ఉంటారని నేను చెప్పటం లేదు కాని కొంతమంది ఇలానే చేస్తూ ఉంటారు . మనకు ఎందుకులే అంటూ ఇంటువంటి విషయాలు పట్టించుకోలేని వారు కొందరైతే , ప్రతీ కార చర్య కోసం ఎదురుచూస్తూ ,సమయం దొరికినప్పుడల్లా ఎదుటివారి గురించే ఆలోచిస్తూ ,సమయాన్ని వారికే తెలియకుండా వృధా చేసుకునే వాళ్ళు కొందరు . మనిషి నచ్చితే పిచ్చిగా ప్రేమను , అభిమానాన్ని పెంచుకోవటం ,అదే నచ్చకపోతే వాళ్ళు మంచి పనులు చేస్తున్నా వీరి మనస్సు వారిని అంగీకరించక వారిలో వారే ఒక సంఘర్షణకు గురికావటం ,అవసరమా ఇవన్నీ మనకు . 

చిన్నప్పటినుంచి చదువుతూ ,చూస్తూనే ఉన్నాము మనకు అపకారం చేసిన వారికి ఉపకారమే చెయ్యాలి 
మనిషి మంచోడు కాకపోవచ్చు ,వారి మనస్సుని చదవండి ,పుట్టుకతో ఎవరూ మనకు మిత్రులుగా ,శత్రువులుగా జన్మించలేదు . ఈ జీవితమనే కాలంలో ఎంతోమంది ఉన్నారు మీకు నచ్చని లేక నచ్చిన వారే కాదు . ఏదో ఒక విషయంలో వారిలో మీరు మెచ్చేది ఉంటుంది . మంచిని ఆహ్వానించాలి . చెడుని అక్కడికక్కడే మనం మర్చిపోవాలి అది కొంచెం కష్టమే కాని మీ అందమైన మనస్సుకు మరలా మరలా సర్దిచెప్పుకుంటూ ఉంటుంటే మీరు చేసించే తప్పు అనిపిస్తుంది . మీకు ఎవరైతే నచ్చట్లేదో వారే కరెక్ట్ అనిపిస్తుంది . ఎవరో తెలియని వాళ్ళకు మనవళ్ళ అంతరాయం కల్గింది అంటేనే స్పందించి సారీ అని అసంకల్పితంగా చెప్పేస్తాం . మరి మనతోటి జీవించే వాళ్ళకు , మన ఆత్మీయులు అనుకున్న వాళ్ళకు ,మీకు మద్యలో ఏదైనా చిన్న పొడపొచ్చాలు వస్తే మాత్రం చిన్న సారీ తో మీ మద్య ఉన్న దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే తప్పేముంది . 

ఈర్ష్యా ,ద్వేషాలు , కోపాలు ,అలకలు ,ప్రతీ కారాలు ,యుగోలు ఇవన్నీ మనకు మనం సృష్టించుకున్నవే వాటితో పాటు ప్రేమ ,ఆప్యాయతలు కూడా సృష్టించుకున్నవే . మరి మన ఈ అందమైన ,అశాశ్వతమైన జీవితంలో అనవసరమైన వైరాలు ,కారాలు ,మిరియాలు ఎందుకు ? మన మంచితనంతో మరొకరిలో మార్పుకు మనమే ప్రయత్నిద్దాం లేదా మనమే వారికోసం మారదాం ..... 
ఒక చిన్న మాట :  11

నిన్న రాత్రి ఫేస్ బుక్ లో ఆత్మీయ నేస్తాలతో కాసేపు అత్మీయపలకరింపులు
అత్మీయతను అందించి ఆనందాన్ని పంచాయి
అప్పుడప్పుడు ఇలా అత్మీయంగా మాట్లాడుకుంటే ఆ జోష్ నే వేరు
పలకరింపులకే కాదు ఈ స్నేహాలు ,చేతలలో కూడా అవసరమైనప్పుడు మనకు సలహాలు ,సూచనలు ఇచ్చేవారు కొందరైతె , ఎదైనా సహాయం కోరగానే ,వారి వారి సమయం వృధా అని భావించక ,మనకెందుకులే అని వదలక మనకు సహాయం చేసేవారు మరికొందరు . ఒక్కొక్కసారి వారి సాన్నిహిత్యం మన కుటుంబసభ్యులులా తలపిస్తుంది కూడా
ధన్యవాదాలు నా  ముఖ పుస్తక మిత్రులకు , ఆత్మీయులకు ......



Saturday, 20 June 2015

ఒక చిన్న మాట -10 : (చేపల వర్షం )
ఇప్పటివరకు మనం ఆమ్ల వర్షం మరియు కృత్రిమ వర్షం లాంటివి విన్నాము అయితే కొద్దిరోజుల క్రితం ధాయిలాండ్ లో చేపల వర్షం కుప్పలు కుప్పలుగా కురిసిందట . అలాగే అంతకుముందు మన దేశంలో మహారాష్ట్ర లోని నాసిక్ లో కూడా కురిసిందట . అయితే చాలా మంది జనాలు వాన వెలిసిన తర్వాత ఆ చేపల్ని పట్టుకుని వండుకుతిన్న వాళ్ళు కొంతమందైతే ,వాటిని సేవ్ చేద్దామని చూసిన వాళ్ళు మరికొంత మంది ఉన్నారంట . ఇది ప్రజల్ని ఆశర్యం కు గురిచేయటమే కాక మంచి విందుని కూడా ఇచ్చిందట . శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఋతుపవనాల ప్రభావం ఆకాశం చేపల్ని ఆకర్షించి ,ఇలా భూమి మీదకు వర్షంలా కురిపిస్తుంది అంటున్నారు .
ఒకటి ఆలోచన వచ్చింది చేపల వర్షం అయితే మనం సరదా పడ్డాం . పసందు చేసుకున్నాం
అదే విధంగా ఏ ''పాముల వర్షమో '' అయితే మనం ఏమి చేసేవాళ్ళం అంటారో ?

Saturday, 13 June 2015

ఒక చిన్న మాట -9

''నిజాలు చెప్పేవాళ్ళు తల ఎత్తుకుని గర్వంగా సమాధానం చెప్తారు ,అబద్దాలు చెప్పే వారు తల దించుకుని సిగ్గుతో సమాధానం చెప్తారు '' అనేది ఒక సామెత . మరి ఈ రోజుల్లో నిజాన్ని ,అబద్దాల్ని అంత తేలికగా తెలుసుకోగల్గుతున్నాము అంటారా .100 కి ఒకసారి నిజం చెబుతుంటే , మిగతా 99 అబద్దాలు ఆడుతున్న రోజులివి .
కాదంటారా ? అవసరంతో మొదలైన అబద్దం అలా అలవాటుగా మనతో పుట్టి పెరిగి పెద్దదవుతుంది .
ఒకరిని నొప్పించకూడదంటే అబద్దం , ఒకరిని ఆకర్షించాలంటే అబద్దం ,చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలంటే అబద్దం ఇలా ఒక్కటేమిటి నిముషం నిముషంలో నీడలా నిన్ను ఫాలో అవుతూ ఉంటుంది అబద్దం . మరి నిజం నిప్పులా కనపడినా అబద్దమనే నీరుతో దానిని ఆర్పేస్తున్నాము . జనాలు కూడా ఆ అబద్దానికే అలవాటుపడిపోతున్నారు . నిజం చెప్పేవాడు నిజాయితీగా చెప్పినా ఎవ్వరు నమ్మరు .అదే అబద్దమైతే కాస్త హావభావాలు మార్చి ఇదే నిజం అంటే చిటుక్కున నమ్మేస్తారు . అలాగే అబద్దానికి ధర ఉంటుంది ,విలువ ఉంటుంది . నిజానికి కూడా విలువ ఉంటుంది కాని అది చెప్పుకోవటం వరకే . దానిని ఆచరణలో పెడితే అది అపాయం తప్ప మంచి జరగటం చాలా తక్కువ . కాని నిజాన్ని ,నిజాయితిని నమ్ముకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ మార్గాన్ని విడువక ముందుకు సాగేవారు కూడా లేకపోలేదు . మరి మనం వింటున్న సామెత ఖచ్చితమే అంటారా . తమ తమ స్వార్దాలకోసం , ప్రయోజనాల కోసం అబద్దాన్ని హస్త్రం లా వాడుతున్నారు చాలామంది వాటినే విని మన అమాయకులు మాత్రం వారినే నమ్ముతూ అబద్దపు జీవితానికి తెలిసి కొందరు ,తెలియక కొందరు స్వాగతం చెబుతున్నారు . అందుకే అబద్దాన్ని ,నిజాన్ని బయటకు తీసే యంత్రాలు కూడా వాడుకలో ఉన్నాయి .
ఇది నా చిన్న విశ్లేషణ మాత్రమే . మన జీవితం అబద్దాల చాటున మగ్గుతున్న యాంత్రిక రూపమే .



Friday, 29 May 2015

ఒక చిన్న మాట ... 7

సాదారణంగా మనం వాహనాలపై వెళ్తున్నప్పుడు చాలా మంది రయ్ మంటూ దూసుకుంటూ వెళ్లిపోతుంటారు 
తమకి ఎవరైనా దారిలో అడ్డువస్తే కాస్త స్లో చేసి వెళ్దామని చూడరు . వాళ్లకి ఎదురుపడిన వాళ్ళే తప్పుకోవాలని అనుకుంటారు . పైగా జిగ్ జాగ్ స్పీడ్ లో ,పెద్దగా హారన్స్ కొట్టుకుంటూ పోతుంటారు . 

ముఖ్యంగా ఏదైనా టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు అలానే వెళ్తుంటారు కాని ఇండికేటర్స్ అస్సలు వేయరు ,దీనివలన ఎదుటివాహనాలు చాలా ఇబ్బంది పడతారని గమనించుకోలేరు . ఇటువంటి మనం చేసే చిన్నవి అనుకునే పనులే రోడ్డు ప్రమాదాలకి కారణమవుతాయి 




Tuesday, 12 May 2015

ఒక చిన్న మాట -6
*********************************************
ప్రేమించటం తప్పు కాదు 
ప్రతీ చిన్న ఎమోషన్ ని ప్రేమ అనుకోవటం తప్పు
ఒక ఫర్ఫెక్షన్ లేకుండా ప్రేమ జోలికి వెళ్ళటం తప్పు
ప్రేమ పేరుతో మనల్ని మనం మర్చిపోయి జీవితగమ్యాన్ని దూరంచేసుకోవటం ఇంకా తప్పు
ఒక చిన్న మాట :5
++++++++++++++++++


ఒకరికి మాట ఇచ్చే ముందు పది సార్లు ఆలోచించుకుంటే మంచిది ఎందుకంటే మాట ఇచ్చాక అది తీసుకున్న వారి గురించి చెడుగా అలోచించకూడదు అలానే మనం ఇచ్చిన మాటకు కట్టుపడకపోతే వారి దగ్గర మన విలువపోతుంది
ఒక చిన్న మాట -4
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

సంగీతదర్శకుల షోలు జరుతున్నాయి అటువంటి వాటిలో మన ఈటీవీ లో వస్తున్న ''ఝుమ్మంది నాదం'' కార్యక్రమం చాలా బాగుంది ఆయా సంగీత దర్శకుల జీవితాలలో జరిగిన సంఘటనలు గురించి కాని వారు వారి జీవితంలో ఈ స్థాయి కి రావడానికి పడిన ప్రయాసలను ,సాధించిన విజయాలను చూపిస్తూ ఉండే కార్యక్రమం చాలా బాగుంది మరి అలానే ఆ మ్యూజిక్ అనేది కధలో ఆట లాంటిది అయితే ఆ అటకు మంచి సాహిత్యం ఇచ్చి మంచి మంచి పాటలను అందించిన గేయరచయితలు గురించి ఎటువంటి ప్రోగ్రాం స్ ఉన్నాయి అనేది నా ప్రశ్న ?
ఒక చిన్న మాట -3
*****************************************
తోచివేసె ప్రక్రియలు ఆపండి
గ్రూప్ రాజకీయాలు ఎందుకు ...
మనిషిని మనిషిలా చూడండి
ప్రతి మనిషిలో మంచి వెతకండి
మంచిని ప్రోత్సాహించండి .....
డాబు ప్రదర్శించే వాళ్ళే ఎందుకు మీకు నచ్చుతారు ...
నిజాయితీగా ఉండే స్నేహం అంత చేదా మీకు ?

Saturday, 11 April 2015

ఒక చిన్న మాట -2 :
+++++++++++++++++++++++++

సాధారణంగా పిలుపులు (లేక ) ఆహ్వానాలు వచ్చినప్పుడు శుభకార్యాలకే అంటే పెళ్లిళ్లు ,బర్తడే ఫంక్షన్ ,
గృహ ప్రవేశాలు ఇంకా ఇతరత్రా వాటికి అందరూ పిలవగానే మరోమారు ఆలోచించకుండా హాజరవుతారు ,
అటువంటి వాటికి ఇంకొంతమందైతే ముందుంటారు మరి అలాగే అశుభకార్యాలకు అంటే ఎవరైనా కాలం చేసినప్పుడు (లేదా ) కర్మలు వాటికి దూరంగా ఉంటారు .కనీసం ఫోన్ చేసి సానుభూతి తెలిపేటంత  టైమ్ కూడా వుండదు వీరికి . అటువంటి వాటికి కొంతమంది దూరంగా ఉంటారు .వెళ్తే ఏదో కీడు వీరి వెంట వస్తుందని అనుకుంటారు ,భయపడతారు . అయ్యో పాపం అని కూడా అనకూడదని ఒక సామెత ఉంది ఎందుకంటే అలా అంటే ఆ పాపం వీరికి తగులుతుందట .

ఇదండీ పరిస్థితి కొన్ని సనాతన ధర్మాలు ఉంటాయి వాటిని నేను కాదనను . కాని శుభకార్యాలకు వెళ్ళినా ,వెళ్లకపోయినా పరువాలేదు కాని చావు (అశుభ) కార్యక్రమాలకు మాత్రం పిలచినా ,పిలువకపోయినా మనకు తెలియగానే వెళ్ళటం మానుకోకూడదు ఎందుకంటే ఆ టైమ్ లో వారికి మన రాక ,మన పలకరింపు ఒక ధైర్యం ,ఒక ఓదార్పు ,మనము వారికోసం ఉన్నామనే భావన పోయిన వారిని తిరిగి తేలేకపోవచ్చు కాని ఒక ఊరట ,మనశ్శాంతినిస్తుంది . 
ఒక చిన్న మాట -1
*************************************************
(ఇది ఎవ్వరిని ఉద్దేశించి కాదు ... సాధారణంగా మనలో జరిగే విషయమే )

అబ్బాయి- అబ్బాయిలు మాట్లాడుకోవటానికి పెద్దగా ఏమీ మాట్లాడుకోలేరు 

అదే అబ్బాయి-అమ్మాయిల మాటలకు మాత్రం అంతం ఉండదు 
ఆరాటం ,అత్యుత్సాహంతో ఏవో ఏవేవో మాట్లాడేసుకుంటారు  
అలాగే అమ్మాయి -అమ్మాయిలు కూడా మాటలు మొదలుపెడితే చాలు 
పెట్టుకున్న బొట్టు నుంచి పడుకునే దాకా ఏమేమిచేసారో 
అన్నీ మాట్లడుకోవాల్సిందే ,ప్రతి మాట పంచుకోవాల్సిందే 
అదే అబ్బాయిలు వారి వారి అమ్మతో కాని ,భార్యతో కాని 
ఎక్కువసేపు మాట్లాడలేరు పైగా మధ్యమధ్యన కోపం ,చిరాకు చూపెడుతూ ఉంటారు 
అదే అబ్బాయిలు ఇంటిపక్క అమ్మాయిలతో లేదా ఫోన్లో అమ్మాయిలతో 
మాట్లాడేటప్పుడు మాత్రం అతి వినయం ప్రదర్శిస్తూ ఉంటారు 
ఇందులో అంతా ఇలానే జరుగక పోయినా ఎంతో కొంత నిజమైతే ఉందని భావన