ఒక చిన్న మాట -2 :
+++++++++++++++++++++++++
సాధారణంగా పిలుపులు (లేక ) ఆహ్వానాలు వచ్చినప్పుడు శుభకార్యాలకే అంటే పెళ్లిళ్లు ,బర్తడే ఫంక్షన్ ,
గృహ ప్రవేశాలు ఇంకా ఇతరత్రా వాటికి అందరూ పిలవగానే మరోమారు ఆలోచించకుండా హాజరవుతారు ,
అటువంటి వాటికి ఇంకొంతమందైతే ముందుంటారు మరి అలాగే అశుభకార్యాలకు అంటే ఎవరైనా కాలం చేసినప్పుడు (లేదా ) కర్మలు వాటికి దూరంగా ఉంటారు .కనీసం ఫోన్ చేసి సానుభూతి తెలిపేటంత టైమ్ కూడా వుండదు వీరికి . అటువంటి వాటికి కొంతమంది దూరంగా ఉంటారు .వెళ్తే ఏదో కీడు వీరి వెంట వస్తుందని అనుకుంటారు ,భయపడతారు . అయ్యో పాపం అని కూడా అనకూడదని ఒక సామెత ఉంది ఎందుకంటే అలా అంటే ఆ పాపం వీరికి తగులుతుందట .
ఇదండీ పరిస్థితి కొన్ని సనాతన ధర్మాలు ఉంటాయి వాటిని నేను కాదనను . కాని శుభకార్యాలకు వెళ్ళినా ,వెళ్లకపోయినా పరువాలేదు కాని చావు (అశుభ) కార్యక్రమాలకు మాత్రం పిలచినా ,పిలువకపోయినా మనకు తెలియగానే వెళ్ళటం మానుకోకూడదు ఎందుకంటే ఆ టైమ్ లో వారికి మన రాక ,మన పలకరింపు ఒక ధైర్యం ,ఒక ఓదార్పు ,మనము వారికోసం ఉన్నామనే భావన పోయిన వారిని తిరిగి తేలేకపోవచ్చు కాని ఒక ఊరట ,మనశ్శాంతినిస్తుంది .

No comments:
Post a Comment