ఒక చిన్న మాట -9
''నిజాలు చెప్పేవాళ్ళు తల ఎత్తుకుని గర్వంగా సమాధానం చెప్తారు ,అబద్దాలు చెప్పే వారు తల దించుకుని సిగ్గుతో సమాధానం చెప్తారు '' అనేది ఒక సామెత . మరి ఈ రోజుల్లో నిజాన్ని ,అబద్దాల్ని అంత తేలికగా తెలుసుకోగల్గుతున్నాము అంటారా .100 కి ఒకసారి నిజం చెబుతుంటే , మిగతా 99 అబద్దాలు ఆడుతున్న రోజులివి .
కాదంటారా ? అవసరంతో మొదలైన అబద్దం అలా అలవాటుగా మనతో పుట్టి పెరిగి పెద్దదవుతుంది .
ఒకరిని నొప్పించకూడదంటే అబద్దం , ఒకరిని ఆకర్షించాలంటే అబద్దం ,చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలంటే అబద్దం ఇలా ఒక్కటేమిటి నిముషం నిముషంలో నీడలా నిన్ను ఫాలో అవుతూ ఉంటుంది అబద్దం . మరి నిజం నిప్పులా కనపడినా అబద్దమనే నీరుతో దానిని ఆర్పేస్తున్నాము . జనాలు కూడా ఆ అబద్దానికే అలవాటుపడిపోతున్నారు . నిజం చెప్పేవాడు నిజాయితీగా చెప్పినా ఎవ్వరు నమ్మరు .అదే అబద్దమైతే కాస్త హావభావాలు మార్చి ఇదే నిజం అంటే చిటుక్కున నమ్మేస్తారు . అలాగే అబద్దానికి ధర ఉంటుంది ,విలువ ఉంటుంది . నిజానికి కూడా విలువ ఉంటుంది కాని అది చెప్పుకోవటం వరకే . దానిని ఆచరణలో పెడితే అది అపాయం తప్ప మంచి జరగటం చాలా తక్కువ . కాని నిజాన్ని ,నిజాయితిని నమ్ముకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ మార్గాన్ని విడువక ముందుకు సాగేవారు కూడా లేకపోలేదు . మరి మనం వింటున్న సామెత ఖచ్చితమే అంటారా . తమ తమ స్వార్దాలకోసం , ప్రయోజనాల కోసం అబద్దాన్ని హస్త్రం లా వాడుతున్నారు చాలామంది వాటినే విని మన అమాయకులు మాత్రం వారినే నమ్ముతూ అబద్దపు జీవితానికి తెలిసి కొందరు ,తెలియక కొందరు స్వాగతం చెబుతున్నారు . అందుకే అబద్దాన్ని ,నిజాన్ని బయటకు తీసే యంత్రాలు కూడా వాడుకలో ఉన్నాయి .
ఇది నా చిన్న విశ్లేషణ మాత్రమే . మన జీవితం అబద్దాల చాటున మగ్గుతున్న యాంత్రిక రూపమే .

No comments:
Post a Comment